ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కాంచన 3' టాలీవుడ్ లో అన్ని కోట్లు లాభాలు తెచ్చిపెట్టిందా...

cinema |  Suryaa Desk  | Published : Tue, May 21, 2019, 12:27 PM



నృత్యదర్శకుడిగానే కాదు, నటుడిగా .. దర్శకుడిగా కూడా లారెన్స్ తానేమిటన్నది నిరూపించుకున్నాడు. హారర్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడంలోను .. ఉత్కంఠభరితంగా ఆ కథలను నడిపించడంలోను లారెన్స్  సిద్ధహస్తుడు. అందువలన ఆయన నుంచి వరుసగా వస్తున్న హారర్ థ్రిల్లర్ సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. భారీ విజయాలను దోసిట్లో పెడుతున్నారు.


ఈ నేపథ్యంలోనే ఆయన తాజా చిత్రంగా 'కాంచన 3' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు .. తమిళ భాషల్లో 100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. 4 వారాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, తెలుగులో భారీ లాభాలను తెచ్చిపెట్టిందని అంటున్నారు. తెలుగులో ఈ సినిమాను 'ఠాగూర్' మధు విడుదల చేశారు. వసూళ్ల పరంగా బి - సి సెంటర్స్ లో దుమ్మురేపేసిన ఈ సినిమా, అన్ని ఖర్చులుపోను ఆయనకి 10 కోట్ల లాభం తెచ్చిపెట్టినట్టు తెలుస్తోంది. నెగిటివ్ టాక్ తో ఈ సినిమా ఈ స్థాయి లాభాలను తీసుకురావడం గురించే ఫిల్మ్ నగర్లో మాట్లాడుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com