కొత్త చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నటి శృతిహాసన్. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. ఆన్ లొకేషన్ నుంచి శృతి ఓ రెడ్ హాట్ ఫోటోని షేర్ చేసి `వర్క్ మోడ్` అని వ్యాఖ్యను జోడించింది. “షూట్ .. ముంబై.. వర్క్ మోడ్.. జెట్ లాగ్.. హ్యాపి టు బి బ్యాక్“ అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో శృతి మేకప్ లేకుండా నేచురల్ గా కనిపిస్తున్నా.. ముఖకవలికల్లో ఏదో మిస్సయ్యిందనే అనిపిస్తోంది. మొన్నటివరకూ మైఖేల్ కోర్సలే తో లైఫ్ ని ఎంజాయ్ చేసింది. ఇప్పుడు తిరిగి స్ట్రెస్ లైఫ్ లో కి అడుగుపెడుతోంది కాబట్టి ఇలా రూపం మారిం దో ఏమో!! తిరిగి షూట్ మోడ్ లోకి వచ్చినందుకు సంతోషంగా ఉందని శృతి చెప్పకనే చెప్పింది.