సీనియర్ యాంకర్..నటి అనసూయ ఫ్యామిలీతో కలిసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని గుల్ మార్గ్ ప్రాంతంలో సేద తీరుతోంది. అక్కడ మంచు కొండలను చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తోంది. తాము జమ్ములోని గుల్ మార్గ్ లో ఉన్నట్లుగా అనసూయ తెలిపింది. ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఆ వీడియోపై ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. ఒక చెట్టు వద్ద నిల్చుని దాని బెరడు తుంచి పేపరు పెన్ను లేని సమయంలో దీనిపై ఉత్తరాలు రాసుకునేవారట అంటూ చెప్పుకొచ్చింది. పేపర్ లేనప్పుడు బెరడు ఉపయోగించే వారు ఓకే మరి పెన్ను లేకుండా దేనితో రాశారమ్మా అంటూ కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు హాట్ యాంకర్ కూల్ అవుతోంది అక్కడ అంటూ కామెంట్స్ చేశారు.