ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ సినిమా మగాళ్లకంటే కూడా ఆడవాళ్లకి బాగా నచ్చుతుందేమో: తేజ

cinema |  Suryaa Desk  | Published : Wed, May 22, 2019, 02:42 PM



తేజ సినిమాలో ఏదో ఒక కొత్తదనం వుంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో వుంది. ఈ కారణంగానే ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆత్రుతను కనబరుస్తారు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'సీత' .. ఈ నెల 24వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో తేజ మాట్లాడాడు.

"రాముడు .. సీత .. రావణాసురుడు కథే ఇది. అయితే ఆ కథను కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాము.  ఈ సినిమాలో పురుషాధిక్య ప్రపంచాన్ని ఎదుర్కొని కాజల్ ఎలా సక్సెస్ ను సాధిస్తుందనే విషయం చుట్టూ కథ తిరుగుతుంది. అందువలన ఈ సినిమా మగాళ్లకంటే కూడా ఆడవాళ్లకి బాగా నచ్చుతుందేమోనని అనుకుంటున్నాను. కథపై నాకు పూర్తి నమ్మకం వుంది. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనే భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com