ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన 'హరోమ్ హర'

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 05:17 PM



జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు నటించిన 'హరోమ్ హర' చిత్రం జూన్ 14, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చినట్లు డిజిటల్ ప్లాట్ఫారం అధికారికంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో మాళవిక శర్మ కథానాయికగా నటించింది. సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్, రవి కాలే మరియు ఇతరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు. శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సుమంత్ నాయుడు ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com