ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఉలాజ్' ట్రైలర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2024, 03:42 PM



బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన రాబోయే హిందీ ప్రాజెక్ట్ ఉలాజ్‌తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉంది. ఈ స్పై థ్రిల్లర్‌ సినిమా ఆగస్టు 2, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. జాతీయ అవార్డు గ్రహీత చిత్రనిర్మాత సుధాంషు సరియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు మరియు పర్వీజ్ షేక్ మరియు సుధాంషు సరియా స్క్రిప్ట్ అందించారు. ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ, రాజేష్ తైలాంగ్, మీయాంగ్ చాంగ్, సచిన్ ఖేడేకర్, రాజేంద్ర గుప్తా మరియు జితేంద్ర జోషి కీలక పాత్రలలో నటిస్తున్నారు. వినీత్ జైన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com