ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ హీరోతో సరసాలాడుతూ... కెమెరాకు చిక్కిన స్టార్ హీరో కూతురు!

cinema |  Suryaa Desk  | Published : Wed, May 22, 2019, 05:10 PM



బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ తన స్నేహితుడైన కార్తీక్ ఆర్యన్‌తో ముంబై నగరంలో కారులో చక్కర్లు కొడుతూ మీడియాకు చిక్కారు. ఇద్దరూ సరసాలాడుతూ షికార్లు చేస్తూ కనిపించారు. అయితే మీడియా కెమెరాలు తమను గమనిస్తున్న విషయం తెలిసి ముఖానికి చేతులు అడ్డుపెట్టే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య స్నేహం కాస్తా... లవ్ రిలేషన్‌గా టర్న్ అవుతోందని, ఈ క్రమంలోనే ఈ యంగ్ యాక్టర్లు రహస్యంగా కలుకుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్. అయితే ఎక్కడా ప్రైవసీ లేక పోవడంతో కారులో తమ సరసనాలు కొనసాగించారట. ఇటీవల పలు ఇంటర్వ్యూలో సైతం సారా తనకు ఇస్టమైన యాక్టర్ ఎవరు అంటే.. కార్తీక్ ఆర్యన్ అంటూ సమాధానమిచ్చి అతడిపై తన ఇష్టాన్ని చాటుకుంది.అయితే సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్‌పై మరో రూమర్ కూడా వినిపిస్తోంది. వీరు పబ్లిసిటీ కోసం డ్రామాలు ఆడుతున్నారని, కావాలనే మీడియా కంటపడేలా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా సారా అలీ ఖాన్... కార్తీ ఆర్యన్ పేరు ప్రస్తావించడం వెనక కారణం కూడా అదే అని అంటున్నారు. ఇద్దరు యాక్టర్ల మధ్య లవ్ రిలేషన్ మొదలైతే మీడియా ఇచ్చే పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. అలాంటి క్రేజ్ దక్కించుకోవడానికి సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ ట్రై చేస్తున్నారట. ఎందుకనో వీరి ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com