ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలనాటి రామచంద్రుడు నుండి 'నా పేరు నువ్వని' లిరికల్ వీడియో అవుట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2024, 04:36 PM



చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో అలనాటి రామచంద్రుడు సినిమాతో కృష్ణవంశీ తెలుగు ఇండస్ట్రీలో తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో మోక్ష కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఆగష్టు 2, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి నా పేరు నువ్వని లిరికల్ సాంగ్ ని విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సీనియర్ నటి సుధ, ప్రమోధిని, వెంకటేష్ కాకమును, చైతన్య గరికిపాటి కూడా కీలక పాత్రలో నటించారు. శశాంక్ తిరుపతి స్వరాలు సమకూర్చగా, ప్రేమ్ సాగర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ ప్రేమకథని హైనివా క్రియేషన్స్ బ్యానర్‌పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com