ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'ఔరోన్ మే కహన్ దమ్ థా'

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2024, 07:41 PM



బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఆరోన్ మే కహన్ దమ్ థా అనే ప్రేమకథతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాకి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ఆగష్టు 2, 2024న విడుదల కానున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో టబు కథానాయికగా నటిస్తోంది. ఆస్కార్ విజేత M.M కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో జిమ్మీ షీర్‌గిల్, శాంతను మహేశ్వరి మరియు సాయి మంజ్రేకర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫ్రైడే ఫిల్మ్స్ మరియు పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై శీతల్ భాటియా మరియు నరేంద్ర హిరావత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com