ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదలవుతున్న హాలీవుడ్ మూవీ

cinema |  Suryaa Desk  | Published : Wed, May 22, 2019, 06:31 PM



అరేబియన్ నైట్స్ స్టోరీస్‌లో అలాద్దీన్ అద్భుతదీపం కథకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ కథని ఎన్నిసార్లు సినిమాగా తీసినా, చూసిన ప్రతిసారీ కొత్తగానే అనిపిస్తుంది. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేసే అలాద్దీన్ మూవీని మరోసారి ప్రేక్షకులకు అందించనున్నారు డిస్నీవారు. ఇప్పుడు అలాద్దీన్‌కి కొన్ని అదనపు హంగులు జోడించి ఆడియన్స్‌ని అరేబియన్ రాజ్యంలోకి తీసుకెళ్ళబోతున్నారు.

హిందీ, తెలుగు, తమిళ భాషల్లో మే 24న అలాద్దీన్ రిలీజ్ కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 350 థియేటర్స్‌‌లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. అలాద్దీన్‌గా మేనా మసూద్, జీనీగా విల్ స్మిత్ నటించగా, జీనీ పాత్రకు వెంకటేష్, అలాద్దీన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పారు. ఇటీవలే డిస్నీ, మార్వెల్ సంస్థలు కలిసి నిర్మించిన ఎవెంజర్స్ ఎండ్‌గేమ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామీ సృష్టించిన సంగతి మరువక ముందే డిస్నీ సంస్థ అలాద్దీన్‌తో ఆడియన్స్‌ని మరోసారి ఆకట్టుకోవడానికి రెడీ అయ్యింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com