వివాదాలు సినిమాలకు ఫ్యాషనైపోయింది. మరి రెండ్రోజులలో విడుదల కానున్న ‘సీత’ చిత్రంపై కూడా ఇలానే వివాదాలు ముసురుకుంటున్నాయి. సీత చిత్రాన్ని తక్షణం విడుదల కాకుండా నిషేధం విధించాలని బీజైవైఎం హైదరాబాద్ అధ్యక్షుడు వినయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటంతో అందరి చూపు ఇప్పుడు సీత సినిమావైపు మరలింది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే సీతాదేవిని ఆమె పేరును వాడుకుని కమర్షియల్ సినిమా తీయడం సరికాదని, ఈ చిత్ర ప్రదర్శనలను అడ్డుకుంటామంటూ భారతీయ జనతా యువమోర్చా(బీజేవైఎం) సినిమాపై నిప్పులు కురిపిస్తోంది.
‘సినిమా ట్రైలర్లో చూపిన సన్నివేశాలు సీతా దేవిని కించపరిచేలా ఉన్నాయని, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా క్రియేటివిటీ పేరుతో సంప్రదాయాలు, విలువలను దిగజార్చిన ఈ సినిమా పై నిషేధం విధించాలని కోరారు.
అయితే సీత సినిమా పూర్తిగా చూడకుండా ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని ఈ చిత్రం మగవాళ్లకంటే ఆడవాళ్లకే ఎక్కువగా నచ్చుతుందని దర్శకుడు తేజ్ అంటున్నారు. తేజ దర్శకత్వంలో కాజల్ కథానాయికగా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా ఈ చిత్రం రూపొందిన విషయం విదితమే.