ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్రెండ్ షిప్ కి ప్రాణమిచ్చే పాత్రలో నాని

cinema |  Suryaa Desk  | Published : Thu, May 23, 2019, 11:23 AM



ప్రస్తుతం నాని .. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' సినిమా చేస్తున్నాడు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో పాటు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలోను నాని చేస్తున్నాడు. ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు. నాని పాత్ర నెగటివ్ గా ఉంటుందనీ, ఒక రకంగా ఆయనే ఈ సినిమాకి విలన్ అనే టాక్ వచ్చింది.

నాని నెగెటివ్ టచ్ వున్న పాత్రలో కనిపించడం నిజమేనట. అయినా ఈ తరహా పాత్రను నాని ఎందుకు చేశాడు? అని మాత్రం అనుకోరట. ఎందుకంటే స్నేహం కోసం త్యాగం చేసే కర్ణుడి తరహా పాత్రలో ఆయన కనిపిస్తాడట. తప్పని తెలిసినా స్నేహం కోసం తెగించి ముందుకు వెళ్లే ఈ పాత్ర ప్రేక్షకుల నుంచి సానుభూతిని తెస్తుందని అంటున్నారు. నాని కెరియర్లో ఇది చెప్పుకోదగిన పాత్ర అవుతుందని చెబుతున్నారు. డిసెంబర్లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com