వై ఎస్ జగన్ ను కొనియాడిన మోహన్ బాబు

  Written by : Suryaa Desk Updated: Thu, May 23, 2019, 11:29 AM

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం దాదాపు ఖాయమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఆ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 149 స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో ఉండగా, టీడీపీ 29 స్థానాలకు పరిమితమైంది. పవన్ కల్యాణ్ సారథ్యంలో జనసేన ఒకే ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉంది. తాజా ఫలితాల సరళిపై టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబు స్పందించారు. జగన్‌కు తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప ధైర్యసాహసాలు ఇచ్చారని కొనియాడారు. అలాగే, జగన్‌కు ప్రజల ఆశీస్సులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
Recent Post