ఆ దర్శకులకు టీలు .. సిగరెట్లు కూడా అందించాను: కేజీఎఫ్ హీరో 'యశ్'

  Written by : Suryaa Desk Updated: Thu, May 23, 2019, 07:56 PM

ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా చిత్రపరిశ్రమకి వచ్చి స్టార్ హీరోగా ఎదగడం అంత తేలికైన విషయం కాదు. అలా ఎదగాలంటే ఎన్నో కష్టాలు పడాలి .. అవమానాలను ఎదుర్కోవాలి .. అదృష్టం కూడా తోడు కావాలి. అలా తన కష్టానికి అదృష్టం కూడా తోడైందని 'కేజీఎఫ్' హీరో యశ్ తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు.

"మొదటి నుంచి కూడా నాకు నటన అంటే ఇష్టం. ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలనే ఆసక్తి ఉండేది. అందుకే స్టార్ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ గా చేరాను. ఆ దర్శకులకు టీలు .. సిగరెట్లు కూడా అందించాను. నేను ఏ పని చేస్తున్నా .. నేను అనుకున్న స్థానానికి ఎలా చేరుకోవాలనే విషయంపైనే దృష్టి ఉండేది. అదృష్టం బాగుండి నా ప్రయత్నాలు ఫలించాయి .. ప్రేక్షకుల ఆదరణ లభించింది. ఇండస్ట్రీలో ఇప్పుడు నాకంటూ ఒక గుర్తింపు వుంది. ఇప్పుడు నేను చేయవలసిందల్లా గతంలో కంటే జాగ్రత్తగా ఉంటూ ఈ స్థానాన్ని కాపాడుకోవడమే" అని చెప్పుకొచ్చాడు. 
Recent Post