శ్రియ‌ని నువ్వే అంద‌మైన దేవ‌త‌వి అని కామెంట్

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 11:51 AM

రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కొశ్చీవ్ ను వివాహం చేసుకున్న తర్వాత న‌టి శ్రియ‌కి సినిమాలు కాస్త తగ్గాయి. ఆయినా మూడు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే శ్రియ తన లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్టుంది. భర్తతో అన్నీ దేశాలు చుట్టేస్తూ అక్కడ ఏవైనా విశేషాలు ఉంటే వాటిని సోషల్ మీడియాద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “నేను ఎగరగలనని నాకు నమ్మకం ఉంది.. దాదాపు ఒక దశాబ్దం తర్వాత మెక్సికోలో” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో బ్లాక్ కలర్ టాప్.. వైట్ కలర్ మిడ్డీ వేసుకున్న శ్రియ తన చేతులను వెనక్కు పెట్టి రెక్కలు వచ్చినట్టుగా పోజిచ్చింది. వెనక పెద్ద సైజులో అందమైన సీతాకోకచిలుక రెక్కలు ఉండడంతో అవి ఆర్టిఫిషియల్ వింగ్స్ మాదిరికాకుండా శ్రియకు ఉన్న నిజమైన రెక్కలేమో అన్నట్టుగా కనిపిస్తున్నాయి.


ఇక ఆ రెక్కలను తనవే అన్నట్టుగా తలను వెనక్కు వంచి ఓ అందమైన నవ్వు నవ్వింది. ఇదో అందమైన ఫోటో. నెటిజనులకు కూడా ఎంతగానో నచ్చింది. ఒకరు ఈ ఫోటోకు “ఎగరటానికి నీకు ఎగ‌స్ట్రా రెక్కలు అవసరం లేదు.. నువ్వే ఒక అందమైన దేవతవి” అన్నారు. మరొకరు “లవ్లీ బటర్ ఫ్లై” అన్నారు. ఇంకొకరు “నీలో ఉండే గ్రేస్ ఎవ్వరికీ రాదు” అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు.


 
Recent Post