సినిమా ఇండస్ట్రీ లో లైంగిక వేధింపుల గురించి మాట్లాడిన అదితీరావు

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 11:54 AM

'చెలియా' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అదితీరావు, 'సమ్మోహనం' సినిమా ద్వారా మరింత చేరువైంది. తెలుగుతో పాటు తమిళంలోను ఆమె వరుస అవకాశాలను అందుకుంటూ వెళుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ చిత్రపరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించింది.

"సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులు వున్నాయి. ఒక సినిమా విషయంలో 'సర్దుకుపోతే ఈ అవకాశం మీకు ఇస్తాము .. లేదంటే మరొకరికి ఈ ఛాన్స్ వెళుతుంది. ఆలోచించుకుని మీ నిర్ణయం చెప్పండి' అన్నారు. అలా అవకాశాలను సంపాదించుకోవలసిన అవసరం నాకు లేదు .. అందుకే నో చెప్పేసి ఆ ప్రాజెక్టును వదిలేశాను. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ధైర్యంగా మాట్లాడాలి. మౌనంగా వుంటే ఆ మౌనాన్ని మరో రకంగా అర్థం చేసుకునే అవకాశం వుంది " అని చెప్పుకొచ్చింది.
Recent Post