పోస్టర్ టాక్: 50 రోజులు కంప్లీట్ చేసుకున్న 'మజిలీ'

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 12:22 PM

నాగచైతన్య .. సమంత .. దివ్యాన్ష కౌశిక్ ప్రధాన పాత్రధారులుగా 'మజిలీ' తెరకెక్కింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విభిన్నమైన ఈ ప్రేమకథా చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను నీరాజనాలు పట్టారు.

భారీ వసూళ్లను సాధిస్తూ వెళుతోన్న ఈ సినిమా, ఈ రోజుతో 25 సెంటర్స్ లో 50 రోజులను పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఈ పోస్టర్ ద్వారానే కృతజ్ఞతలు తెలిపారు. 'మజిలీ' తరువాత వచ్చిన చాలా సినిమాల పోటీని తట్టుకుని ఈ స్థాయి విజయాన్ని సాధించడం నిజంగానే విశేషమని చెప్పుకోవాలి. 
Recent Post