'ఎన్జీకే' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఖరారు

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 12:58 PM

సూర్య కథానాయకుడిగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన 'ఎన్జీకే' తమిళంతో పాటు తెలుగులోను ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ - ఫిల్మ్ నగర్లోని జెఆర్సీ కన్వెన్షన్లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది.

పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ .. సాయిపల్లవి కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ మధ్య కాలంలో అటు తమిళంలోగానీ .. ఇటు తెలుగులో గాని సూర్య హిట్ ఇవ్వలేకపోయాడు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో ఆయన వున్నాడు. ఆయన అభిమానులు కూడా అదే ఆశతో వున్నారు. ఈ రెండు భాషల్లో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి మరి.
Recent Post