అలియా భట్ కు అరుదైన గౌరవం

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 01:25 PM

బాలీవుడ్ తెరపై సందడి చేసే అందమైన భామలలో అలియా భట్ ఒకరు. టీనేజ్ లోనే కథానాయికగా తెరపైకి వచ్చేసిన అలియా, కుర్రకారు హృదయాలను పొలోమంటూ దోచేసింది. అటు గ్లామర్ పరంగాను .. ఇటు నటన పరంగాను మంచి మార్కులు కొట్టేసింది. వరుస అవకాశాలతో పాటు, వరుస విజయాలను కూడా తన ఖాతాలో వేసుకుంటోంది.

అలాంటి అలియా 'మోస్ట్ డిజైరబుల్ ఉమెన్'గా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. బాలీవుడ్ తెరపై టాప్ హీరోయిన్స్ గా తమ హవాను కొనసాగిస్తున్నవారిని సైతం వెనక్కి నెట్టేసి ఆమె ఈ టైటిల్ కొట్టేయడం విశేషం. మొత్తం 50 మందితో కూడిన ఈ జాబితాలో అలియా తరువాత స్థానాల్లో మీనాక్షి చౌదరి .. కత్రినా కైఫ్ .. దీపికా పదుకొనె .. గాయత్రి భరద్వాజ్ .. అదితీరావు .. జాక్విలిన్ ఫెర్నాండెజ్ .. దిశా పటాని .. అనుకృతి తదితరులు వున్నారు. ప్రస్తుతం అలియా తెలుగులో 'ఆర్ ఆర్ ఆర్' .. హిందీలో 'బ్రహ్మాస్త్ర' .. 'సడక్ 2' సినిమాలు చేస్తోంది. 
Recent Post