కొంతమంది వచ్చి అభిమాన సంఘాలు పెడతామని అన్నారు: సునీల్

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 01:55 PM

ఒక వైపున హీరోగా .. మరో వైపున కమెడియన్ గా చేస్తూ సునీల్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "అందరి హీరోల అభిమానులు నన్ను ఇష్టపడతారు .. నా సినిమాలు చూస్తారు. నిజం చెప్పాలంటే నేను చేసుకున్న అదృష్టం అది. నాకంటూ ప్రత్యేకంగా అభిమాన సంఘాలు లేవు.

గతంలో కొంతమంది వచ్చి అభిమాన సంఘాలు పెడతామని అన్నారు. 'అలాంటి పని చేయకండి .. సమయం చాలా విలువైంది .. అలాంటి సమయాన్ని మీ కుటుంబం కోసం కేటాయించండి. జీవితంలో ఏదైనా సాధించదలచుకుంటే దానిపై దృష్టి పెట్టండి. మీరు మీ పని చేసుకుంటూనే .. నా సినిమా ఒకసారి చూడండి .. బాగుంటే పదిమందికి చెప్పండి. అంతేగాని ఇలా నా కోసం మీ సమయాన్ని వృథా చేసుకోవద్దు .. జీవితంలో తిరిగిరానిది సమయమే అని చెబుతుంటాను" అన్నారు. 
Recent Post