ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాక్స్ ఆఫీస్: 'మహర్షి' మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 24, 2019, 04:20 PM



మహేశ్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయ విహారం చేస్తోంది. రెండు వారాల్లో ఈ సినిమా 150 కోట్లకి పైగా గ్రాస్ ను, 90 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

ఈ సినిమా 100 కోట్ల షేర్ ను రాబట్టడానికి మరెన్నో రోజులు పట్టదని అంటున్నారు. తన సిల్వర్ జూబ్లీ సినిమా ఈ స్థాయిలో ఆడటంతో మహేశ్ బాబు ఫుల్ హ్యాపీగా వున్నాడు. ఈ సినిమాతో ఆయన కొత్త రికార్డులను నమోదు చేయడం పట్ల అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ బాబు 26వ సినిమా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వుండనుందనే సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com