ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సూర్య44' గ్లింప్సె రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 04:08 PM



కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి ప్రాజెక్ట్ ని కార్తీక్ సుబ్బరాజ్‌తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి లవ్ లాఫ్టర్ వార్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో సూర్యకి జోడిగా సిజ్లింగ్ బ్యూటీ పూజా హెడ్గే నటిస్తుంది. ఈ సినిమా నటుడి కెరీర్‌లో 44వ చిత్రం.  తాజాగా ఈరోజు సూర్య పుట్టినరోజు సందర్భంగా మూవీ మేకర్స్ సూర్య44 నుండి ఒక ప్రత్యేక గ్లింప్సె ని ఆవిష్కరించారు. కొద్దిసేపటికే, ఈ గ్లింప్సె సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రారంభించింది. ఈ సినిమాలో జయ రామ్, కరుణాకరన్, జోజు జార్జ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంతోష్ నారాయణ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com