బాగా పరిచయమైతేనే తప్ప ఎవరితో కలిసేవాడిని కాదు: జాకీ

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 05:47 PM

నటుడిగా జాకీకి మంచి గుర్తింపు వుంది. ముఖ్యంగా ఆయన బుల్లితెర ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "మొదటి నుంచి కూడా నాకు కాస్త మొహమాటం ఎక్కువ. బాగా పరిచయమైతేనే తప్ప ఎవరితో కలిసేవాడిని కాదు. అప్పట్లో నాకు నటనపై కోరిక కూడా ఉండేది కాదు. స్నేహితుల సూచన మేరకు సినిమాల పట్ల ఆసక్తిని చూపించాను.


ఫలితంగా తొలిసారిగా 'ప్రార్ధన' సినిమాలో నటించాను. ఆ తరువాత కూడా కొన్ని సినిమాలు చేశాను. కానీ ఆ సినిమాలు సక్సెస్ కాకపోవడం వలన అవకాశాలు పెద్దగా రాలేదు. అలాంటి సమయంలోనే ఈటీవీ నుంచి 'సంఘర్షణ' సీరియల్ కోసం పిలుపొచ్చింది. ఆ సీరియల్లో హరిత కూడా ఒక పాత్ర కోసం ఎంపికైంది. అంతకుముందు ఒక సందర్భంలో ఒకరినొకరం చూసుకున్నప్పటికీ, ఈ సీరియల్ కారణంగా మా మధ్య పరిచయం పెరిగింది" అని చెప్పుకొచ్చారు. 
Recent Post