ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వార్ 2' షూటింగ్ ని ఈ తేదీన ప్రారంభించనున్న జూనియర్ ఎన్టీఆర్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 04:34 PM



బాలీవుడ్ మూవీ వార్ 2లో సౌత్ ఇండియన్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి అందరికి తెలిసిందే. హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో నటించిన వార్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్పెషల్ లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ముంబైలో కొంత భాగం షూటింగ్ పూర్తయింది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే, ఎన్టీఆర్ ఈ ఏడాది ఆగస్ట్ 18 నుంచి కొత్త షెడ్యూల్‌ని ప్రారంభించనున్నారు. ముంబై మరియు యూరప్‌లో భారీ యాక్షన్-ప్యాక్డ్ షెడ్యూల్ ని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి దర్శకత్వం వహించనున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ 2025 ఆగస్టు 14న విడుదల కానుంది. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, మరియు టైగర్ 3 తర్వాత YRF స్పై యూనివర్స్‌లో ఇది ఆరవ చిత్రం. వార్ 2 చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com