ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిందీ మార్కెట్‌లో RRR రికార్డును బ్రేక్ చేసిన 'కల్కి 2898 AD'

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 05:10 PM



నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' చిత్రం జూన్ 27,2024న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా హిందీ బెల్ట్‌లో 275 కోట్ల క్లబ్‌లో చేరింది. నాల్గవ ఆదివారం (25వ రోజు) ముగిసే సమయానికి, కల్కి 2898 AD ఒక్క నార్త్‌ బెల్ట్‌లోనే 277 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. SS రాజమౌళి RRR (275 కోట్ల గ్రాస్) యొక్క లైఫ్ టైమ్ కలెక్షన్లను అధిగమించింది. ఈ సినిమా ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు చేసిన హిందీ-డబ్బింగ్ తెలుగు చిత్రంగా మూడవ స్థానంలో నిలిచింది. ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, అన్నా బెన్, పశుపతి, రాజేంద్ర ప్రసాద్, మాళవిక నాయర్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ఈ హై బడ్జెట్ సినిమాని నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com