దయచేసి 'విశ్వామిత్ర' ను చూడండి అంటున్న సత్యం రాజేష్

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 06:08 PM

ఇప్పటికే పలువురు కమెడియన్లు హీరోలుగా మారి సత్తా చాటుతున్నారు. కమెడియన్లు హీరోలుగా మారడమనేది ఈనాటి విషయం కాదు, కొత్త విషయం అంతకన్నా కాదు, నేటి తరం కమెడియన్స్ సునీల్‌, శ్రీనివాస్‌ రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్‌ తదితరులు హీరోలుగా తమ టాలెంట్‌ చూపించేశారు.


తాజాగా ఇదే బాటలో తన అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నాడు మరో ప్రముఖ కమెడియన్‌ సత్యం రాజేష్‌. తొలి సినిమా ‘సత్యం’ తన ఇంటి పేరుగా మార్చుకున్నాడీ యంగ్‌స్టర్‌. . ఇప్పుడు “విశ్వామిత్ర” అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. అమెరికాలో జరిగిన ఓ యదార్ధ గాధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రాజ్‌కిరణ్‌ ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయమవుతున్నాడు.ఈ కమెడియన్ ట్విట్టర్ వేదికగా జూన్ 14న విడుదల అవుతున్న “విశ్వామిత్ర” మూవీని దయతో చూసి ఆదరించమని ప్రేక్షకులను వేడుకున్నాడు.
Recent Post