ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'కీడ కోలా'

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 08:20 PM



తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వం వహించిన 'కీడ కోలా' సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆగష్టు 11, 2024 మధ్యాహ్నం 01.00 గంటకి స్టార్ మా ఛానెల్‌లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది అని సమాచారం. క్రైమ్ కామెడీగా వచ్చిన ఈ సినిమాలో బ్రహ్మానందం, చైతన్య రావు, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, రఘు రామ్, జీవన్ కుమార్ మరియు తరుణ్ భాస్కర్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. వీజీ సైన్మా బ్యానర్‌పై కె వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com