ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వేట్టయాన్‌' విడుదలపై ఉత్కంఠను రేపుతున్న రజనీకాంత్‌ ప్రకటన

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 08:31 PM



జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ తో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ వేట్టైయన్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టైటిల్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల, రజనీని విమానాశ్రయంలో విలేఖరులు ఇండియన్ 2 మరియు వెట్టయాన్ గురించి అడిగారు. దానికి రజనీ స్పందిస్తూ... నేను ఇండియన్ 2 చూశాను. ఇది మంచి సినిమా. వెట్టయన్‌కి సంబంధించి, విడుదల తేదీ ఇంకా లాక్ కాలేదు. డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. కూలీ షూటింగ్ స్టార్ట్ అయింది. బాగానే ఉంది అని అన్నారు. సూపర్ స్టార్ ప్రకటన వెట్టయన్ విడుదలపై ఉత్కంఠను మరింత పెంచింది. వేట్టైయన్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్, GM సుందర్, రోహిణి, రావు రమేష్, రమేష్ తిలక్ మరియు రక్షణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com