రణ్ వీర్‌కి పెళ్లి కాక‌పోతే నేను చేసుకునేదాన్ని..

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 06:56 PM

బాలీవుడ్ న‌టుడు రణ్ వీర్ సింగ్ అంటే తనకి ఎంతో ఇష్టమనీ .. ఆయన ఎనర్జీ ఒక రేంజ్ లో ఉంటుందని న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. రణ్ వీర్ సింగ్ కి పెళ్లి కాకుండా వుంటే తాను చేసుకుని ఉండేదానినని చెప్పింది. బాలీవుడ్ పై రకుల్ దృష్టి పెట్టింది. హిందీలో ఆమె చేసిన ‘దే దే ప్యార్ దే’ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా వసూళ్లు పెరుగుతుండటంతో రకుల్ ఫుల్ ఖుషీ అవుతోంది. బాలీవుడ్ లోని కొంతమంది దర్శక నిర్మాతలు ఆమెను తమ ప్రాజెక్టుల్లోకి తీసుకునేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నారట. త‌న చిత్రాల‌కి ల‌భిస్తున్న ఆద‌ర‌ణ చూసి సంతోషాన్ని వ్య‌క్తం చేసింది ఈ భామ‌.
Recent Post