'కౌసల్య కృష్ణమూర్తి' ది క్రికెటర్‌ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదల

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 12:06 AM

 నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య క ష్ణమూర్తి ది క్రికెటర్‌'. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ని దర్శకుడు భీమనేని శ్రీనివాస్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా..


క్రియేటివ్‌ కమర్షియల్స్‌ అధినేత కె.ఎస్‌. రామారావు మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర టైటిల్‌ రోల్‌ ఐశ్వర్యా రాజేష్‌ పోషించారు. సీనియర్‌ నటుడు అమర్‌నాథ్‌ తనయుడు, కథానాయకుడు రాజేష్‌ కుమార్తె. తమిళ్‌లో 'కణ' అనే మూవీ చూసి ఈ సినిమా చాలా క్రియేటివ్‌గా ఉంది. ఇప్పటి యూత్‌కి కనెక్ట్‌ అయ్యేలా ఉంది అని ఈ చిత్రం రైట్స్‌ తీసుకున్నాను. ఈ చిత్రానికి దర్శకుడు భీమనేని శ్రీనివాస్‌ అయితే న్యాయం చేస్తారని ఆయన్ని కాంటాక్ట్‌ అవ్వడం జరిగింది. టైటిల్‌కి తగ్గట్లే ఆ అమ్మాయి టైలర్‌మేడ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ప్రదర్శించింది. తమిళ్‌, మలయాళం భాషల్లో 25 చిత్రాలకు పైగా నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ తెలుగు అమ్మాయి ఈ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌ ఆమెకి తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. క్రికెట్‌ని బేస్‌తో పాటు కంటెంట్‌ ఉండే స్టోరి. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్లుగా దర్శకుడు భీమనేని ఈ సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించారు. కార్తీక్‌ రాజు ఈ సినిమాలో హీరోయిన్‌కి లవర్‌గా నటించారు. ఇందులో నాలుగు సాంగ్స్‌ ఉన్నాయి. తమిళ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ధిబు నినన్‌నే ఈ సినిమాకి తీసుకోవడం జరిగింది. సంగీతంతో పాటు మంచి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. ఆడియో, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్స్‌ను జరుపుకొని జూలై ఫస్ట్‌వీక్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఐశ్వర్యా రాజేష్‌ మంచి పెర్‌ఫార్మర్‌ కనుకనే మా బేనర్‌లో రెండో సినిమా చేస్తున్నాం'' అన్నారు.


 


చిత్ర దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ - ''కౌసల్య కృష్ణమూర్తి' ఓపెనింగ్‌ అప్పుడు ఒక న్యూస్‌ వచ్చింది. మళ్ళీ షూటింగ్‌ పూర్తి చేసుకొని ఇప్పుడు మీ ముందుకు వచ్చాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ చివరి దశలో ఉంది. కొన్ని వందల, వేల కథలు సినిమా రూపంలో ఆడియన్స్‌ ముందుకు వస్తాయి కాబట్టి కొత్త కథల్ని చూడాలనుకోవడంలో తప్పు లేదు. అలాంటి ఒక మంచి కథ కోసం వెదుకుతున్న సమయంలో తమిళంలో రిలీజై సూపర్‌హిట్‌ అయిన 'కణ' సినిమాని చూడటం జరిగింది. ఆ సినిమాని తెలుగులో చేద్దామనుకుంటున్న సమయంలో ఈ సినిమా తెలుగు రైట్స్‌ గురించి చాలామంది ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మనం తినే బియ్యపు గింజ మీద మన పేరు రాసుంటే ఎలా అయినా మన దగ్గరకి వస్తుంది అన్నట్లు ఒకరోజు కె.ఎస్‌. రామారావుగారు ఫోన్‌ చేసి, 'కణ' సినిమా రైట్స్‌ తీసుకున్నాను. మీరు ఒకసారి చూడండి, తెలుగులో సినిమా చేద్దాం అన్నారు. నేను అప్పటికే ఆ సినిమా చాలాసార్లు చూసి ఉన్నాను. తప్పకుండా ఈ సినిమా చేద్దాం అని చెప్పాను. 50 సంవత్సరాలుగా 47 సినిమాలు ప్రొడ్యూస్‌ చేసి, అన్నీ క్రాఫ్ట్స్‌ పట్ల కమాండింగ్‌ ఉన్న క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బేనర్‌లో ఈ సినిమాని తెరకెక్కించడం నిజంగా నా అదృష్టం. అంతకు మించి ఈ సినిమా ఒక లైఫ్‌ చూస్తున్నట్లుంటుంది. ఆడియన్స్‌ ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌ ఇంటికొచ్చాక కూడా మనల్ని హంట్‌ చేస్తూ ఉంటే అది ఒక గొప్ప సినిమా అని అర్థం. అలాంటి మంచి స్టోరి, కంటెంట్‌ ఉన్న సినిమా ఇది. అన్నారు.
Recent Post