ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ మొత్తానికి అమ్ముడయిన 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' కేరళ రైట్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 04:50 PM



కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తన తదుపరి చిత్రాన్ని వెంకట్ ప్రభుతో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఈ సినిమాకి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (G.O.A.T.) అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా యొక్క కేరళ థియేటర్ రైట్స్ ని శ్రీ గోకులం మూవీస్ బ్యానర్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా యొక్క కేరళ థియేట్రికల్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్ 17 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమా సేఫ్ జోన్‌లో ఉండాలంటే 40 కోట్లకు పైగా గ్రాస్ సంపాదించాలి. ఈ సినిమాలో విజయ్ సరసన హ్యాపెనింగ్ నటి మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కలాపతి, కళపతి ఎస్ అఘోరం, కలపతి ఎస్ గణేష్, కళపతి ఎస్ సురేష్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 5, 2024న గ్రాండ్ విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com