ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అలనాటి రామచంద్రుడు' వైజాగ్ ప్రమోషనల్ టూర్ డీటెయిల్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 05:13 PM



చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో 'అలనాటి రామచంద్రుడు' సినిమాతో కృష్ణవంశీ తెలుగు ఇండస్ట్రీలో తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో మోక్ష కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఇప్పుడు మూవీ టీమ్ మీట్ అండ్ గ్రీట్ లో భగంగా ఈరోజు అంటే జులై 25న వైజాగ్ కి వెళ్లనున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సీనియర్ నటి సుధ, ప్రమోధిని, వెంకటేష్ కాకమును, చైతన్య గరికిపాటి కూడా కీలక పాత్రలో నటించారు. శశాంక్ తిరుపతి స్వరాలు సమకూర్చగా, ప్రేమ్ సాగర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ ప్రేమకథని హైనివా క్రియేషన్స్ బ్యానర్‌పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మించారు. ఈ సినిమా ఆగష్టు 2, 2024న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com