విజయ్ దేవరకొండ ఈసారి మిలటరీ ప్రేమకథతో వస్తున్నాడు...

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 11:30 AM

ప్రేమకథా చిత్రాలను ఒక దృశ్యకావ్యంలా తెరకెక్కించడంలో హను రాఘవపూడి సిద్ధహస్తుడు. శర్వానంద్ - సాయిపల్లవి జంటగా ఇంతకుముందు ఆయన చేసిన 'పడి పడిలేచే మనసు' అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దాంతో ఆయన మరో ప్రేమకథను తయారు చేసుకుని, తాజాగా విజయ్ దేవరకొండకి వినిపించాడట.

కథ నచ్చేసిందని విజయ్ దేవరకొండ చెప్పడంతో, పూర్తిస్థాయి స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో హను రాఘవపూడి వున్నాడని అంటున్నారు. మిలటరీ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం క్రాంతిమాధవ్ .. ఆనంద్ అన్నామలై ప్రాజెక్టులతో విజయ్ దేవరకొండ బిజీగా వున్నాడు. ఆ రెండు ప్రాజెక్టులు ఒక దారికి వచ్చిన తరువాత ఆయన హను రాఘవపూడితో కలిసి సెట్స్ పైకి వెళతాడని అంటున్నారు.
Recent Post