ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రూమర్స్ కి చెక్ పెట్టిన తారా సుతారియా

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 03:23 PM



ముంబయి: యశ్‌ (Yash) హీరోగా నటిస్తోన్న పాన్‌ ఇండియా మూవీ 'టాక్సిక్‌' (Toxic). భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో తాను భాగమైనట్లు వస్తోన్న వార్తలపై బాలీవుడ్‌ నటి తారా సుతారియా స్పందించారు.ఆయా వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. ''ఓ ప్రాజెక్ట్‌లో నేను భాగమయ్యానంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆ కథనాల్లో వాస్తవం లేదు. ఆ సినిమాలో యాక్ట్‌ చేస్తున్నానని నేను ఎక్కడా చెప్పలేదు. అలాంటిది ఏదైనా ఉంటే తప్పకుండా మీ అందరితో పంచుకుంటా. నాపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తుంటా. ప్లీజ్‌ నోట్‌: ఎవరూ ఎవరికీ రెండో మనిషి కాలేరు'' అని ఆమె రాసుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com