ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'దేవర' సెకండ్ సింగల్ కి గాత్రం అందించిన ప్రముఖ సింగర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 03:41 PM



కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'దేవర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ సినిమా గ్లింప్స్ మరియు ఫస్ట్ సింగిల్‌కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలోని సెకండ్ సింగల్ కి శిల్పా రావు తన గాత్రాన్ని అందించినట్లు సమాచారం. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, శృతిమరాఠే, తారక్ పొన్నప కీలక పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com