ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సంయుక్త మీనన్ ?

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 02:16 PM



కెరీర్ ఆరంభం నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ లో తనదైన మార్క్ ప్రదర్శిస్తూనే ఉన్నాడు. అయితే సరైన హిట్లు పడడం లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్ కావడం లేదు. కానీ బెల్లంకొండ హీరో మాత్రం ప్రయత్నాలు ఆపడం లేదు.వరుసగా మాస్ చిత్రాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల లైనప్ మామూలుగా లేదు. తన సినిమాలతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోయిన్ల విషయంలో కూడా పర్టికులర్ గా ఉంటున్నారు. క్రేజీ హీరోయిన్లని మాత్రమే తన చిత్రాల కోసం ఎంపిక చేసుకుంటున్నాడు. టైసన్ నాయుడు చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. మరో చిత్రం కోసం అనుపమ పరమేశ్వరన్ ని ఎంపిక చేశారు. లుధిర్ బైరెడ్డి దర్శకత్వంలో ఒక చిత్రం ఖరారైంది. ఈ చిత్రంలో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇలా బెల్లంకొండ శ్రీనివాస్ వరుసగా క్రేజీ హీరోయిన్లతోనే రొమాన్స్ చేస్తున్నాడు. ఆల్రెడీ బెల్లంకొండ శ్రీనివాస్ కాజల్, సమంత, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో నటించాడు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com