అనుష్క 'నిశ్శబ్దం' ఫై తాజా వార్త

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 02:15 PM

అనుష్క ప్రధాన పాత్రధారిగా హేమంత్ మధుకర్ ఒక థ్రిల్లర్ మూవీని రూపొందించనున్నాడనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. కథాపరంగా ఈ సినిమా షూటింగు అమెరికాలో ఎక్కువగా జరపనున్నట్టు చెప్పుకున్నారు. రీసెంట్ గా ఈ సినిమా టీమ్ అమెరికా వెళ్లింది. తాజాగా అక్కడ ఈ సినిమా షూటింగును మొదలుపెట్టేశారు.


కోన ఫిల్మ్ కార్పొరేషన్ .. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగు వెర్షన్ కి 'నిశ్శబ్దం' .. ఇంగ్లిష్ వెర్షన్ కి 'సైలెన్స్' అనే టైటిల్స్ ను ఖరారు చేశారు. ఇదే అర్థం వచ్చేలా ఇతర భాషల్లోను టైటిల్స్ ను ఖరారు చేయనున్నారు. మాధవన్ కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాలో, షాలినీ పాండే కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. 
Recent Post