ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డబుల్ ఇస్మార్ట్' నుండి క్యా లాఫ్డా సాంగ్ ప్రోమో విడుదలకి టైమ్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 02:40 PM



టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని థర్డ్ సింగల్ క్యా లాఫ్డా ప్రోమోని ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకి విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమాలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్ గా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి CEOగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com