రియల్ భార్యాభర్తలు రీల్ భార్యాభర్తలుగా వస్తున్నారు....

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 04:56 PM

తమిళ హీరో ఆర్య .. సాయేషా సైగల్ గతంలో 'గజనీకాంత్' అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా సమయంలో వాళ్లు ప్రేమలో పడటం .. ఆ తరువాత పెళ్లి చేసుకోవడం తెలిసిందే. పెళ్లి తరువాత ఎవరి సినిమాలు వాళ్లు చేస్తూ వెళుతున్నారు. అయితే తెరపై భార్యాభర్తలుగా కనిపించే ఒక కథతో వీళ్లు ప్రేక్షకులను పలకరించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. 


తమిళంలో శక్తి సౌందరరాజన్ 'టెడ్డీ' అనే ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నిన్ననే ఈ సినిమా చెన్నైలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ కథలో ఈ జంట ఫస్టాఫ్ లో ప్రేమికులుగా .. ఆ తరువాత భార్యాభర్తలుగా కనిపిస్తారని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి. 
Recent Post