సుధీర్ వర్మ-శర్వానంద్ సినిమాకి 'రణరంగం' టైటిల్ ఖరారు

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 05:39 PM

సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ ఒక యాక్షన్ మూవీ చేస్తున్నాడు. వైజాగ్ నేపథ్యంలో మొదలయ్యే ఈ కథలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్' గా కనిపించనున్నాడు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి  చేరుకుంది. నిన్నటివరకూ ఈ సినిమా టైటిల్ ఏమిటనేది చెప్పలేదు. నిన్న మాత్రం .. ఈ రోజున ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టుగా ఒక పోస్టర్ ను వదిలారు.

ముందుగా చెప్పినట్టుగానే కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకి 'రణరంగం' అనే టైటిల్ ను ఖరారు చేస్తూ శర్వానంద్ లుక్ ను వదిలారు. మధ్య వయస్కుడైన గ్యాంగ్ స్టర్ గా ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. కాజల్ .. కల్యాణి ప్రియదర్శన్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాను, ఆగస్టు 2వ తేదీన విడుదల చేయనున్నారు.
Recent Post