శర్వానంద్‌తో సినిమా చేయ‌నున్నశ్రీరామ్ ఆదిత్య‌

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 07:50 PM

భ‌లే మంచిరోజు` సినిమాతో డైరెక్ట‌ర్‌గా తొలి స‌క్సెస్ సాధించిన శ్రీరామ్ ఆదిత్య‌, త‌ర్వాత శ‌మంత‌క‌మ‌ణి, దేవ‌దాస్ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాడు. ఇప్పుడు శర్వానంద్‌తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.. ఇంతకుముందే వీరి కాంబోలో సినిమా రావాల్సి ఉంది కానీ, ఏవేవో కారణాల వల్ల కుదరలేదు.. అయితే ఈసారి మంచి హిట్ కొట్టాల‌నే ఆలోచనతో, శర్వాకోసం ఓ మంచి కథను రెడీ చేసాడట శ్రీరామ్.. అతను చెప్పిన కథ శర్వానంద్‌కి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.  శర్వానంద్‌  ప్రస్తుతం సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు 'రణరంగం' అనే టైటిల్‌ ఫిక్స్ చేసారు. కాజల్ఇ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటుందీ సినిమా.. రణరంగం పూర్తయ్యాక శ్రీరామ్‌ ఆదిత్య, శర్వానంద్‌ల సినిమా పట్టాలెక్కనుంది. 


 
Recent Post