హీరోగా బుల్లితెర స్టార్ కమెడియన్!

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 07:52 PM

జబర్దస్త్, ఢీ షోలతో బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా దూసుకుపోతున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు హీరోగా నటించనున్నాడు. 'సాఫ్ట్‌వేర్ సుధీర్‌' అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ధన్యా హీరోయిన్. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ 50 శాతం పూర్తి అయింది. ఈ సినిమాను జులై చివరి వారంలో విడుదలకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ... ''అందరూ నన్ను హీరో అంటున్నారు. కానీ  ఈ సినిమాకు కథే హీరో. నాకు ఈ కథ చెప్పగానే చాలా థ్రిల్లింగ్‌‌గా అనిపించింది. సినిమా మంచి విజయాన్ని ఇస్తుందని అనుకుంటున్నా’ అని తెలిపాడు.  టీవీ షోలో తెచ్చుకున్న సుడిగాలి సుధీర్..సినిమాల్లో రాణిస్తాడా ? లేదా ? అనేది చూడాలి. 


 
Recent Post