తెలుగు లో ఇంకో టెంపర్!

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 08:18 PM

ఎన్టీఆర్ కాజల్ అగర్వాల్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన చిత్రం టెంపర్ పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ ని మళ్ళి గాడి లో పెట్టిన సినిమా. మరో పక్క ఈ సినేమా వివిధ భాషల్లో కూడా రీమేక్ చేయబడగా తమిళ భాష లో విశాల్ హీరో గా చేసాడు. కాజల్ స్థానం లో రాశి ఖన్నా నటించగా, ప్రకాష్ రాజ్ బదులు ఈ సినిమా లో పార్తీబన్ నటించారు.
ఇకపోతే ఈ సినిమా తమిళం లో విడుదల అయినా రోజే మంచి పేరు సంపాదించుకుంది. ప్రేక్షకులని అభిమానులని అలరించిన ఈ సినిమా ని ఇప్పుడు విశాల్ తెలుగు లో కి తీసుకొని రావాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయోగ్య గా తమిళ్ లో విడుదల అయినా ఈ సినిమా ని తెలుగు లో డబ్ చేయాలనీ విశాల్ ప్లాన్. ముందుగా నే ఈ సినిమా ని తెలుగు లో కి తేవాలని అనుకున్నారట కానీ సినిమా ఎండింగ్ తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేరు అనే ఉదేశ్యం తో ఆగిపోయారట.
అయితే తమిళ్ లో సినిమా ఎండింగ్ కి మంచి రెస్పాన్స్ రావడం తో చిత్ర యూనిట్ దానిని కంటిన్యు చేయాలని భావిస్తున్నారు. మల్కాపురం శివ కుమార్ ఈ సినిమా కి సంబందించిన డబ్బింగ్ రైట్స్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది.


 


 
Recent Post