ఎన్టీఆర్ పై ఫాన్స్ ఒత్తిడి!

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 08:33 PM

ఎన్టీఆర్ ప్రస్తుతం తనకి ఎంతో ఇష్టమైన రాజమౌళి దర్శకత్వం లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా షూటింగ్ తో బిజీ గా గడుపుతున్నాడు. ఆ మధ్య చిన్న గాయం అయినా, దాని నుండి త్వరగా కోలుకొని ప్రస్తుతం సినిమా షూట్ కి అందుబాటు లో ఉన్నాడు తారక్. ఈ సినిమా లో తారక్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. తారక్ కొమరం భీం పాత్ర పోషిస్తుండగా, చరణ్ మాత్రం అల్లూరి సీత రామ రాజు పాత్ర పోషిస్తున్నాడు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే అలియా భట్, నిత్య మీనన్ ఈ సినిమా లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా విడుదల అయ్యే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆ తర్వాత తారక్ ఏం సినిమా చేయాలి అని ఇప్పటి నుండే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. సాధారణం గా రాజమౌళి సినిమాలకి పరాజయం ఉండదు కనుక ఆ తదుపరి చిత్రం కూడా అంతే రేంజ్ లో సక్సెస్ అవ్వాలి కానీ యావరేజ్ టాక్ రాకూడదు. ఈ విషయమై ఫాన్స్ ఇప్పటికే తారక్ మీద ఒత్తిడి తెస్తున్నారట. ఆర్ఆర్ఆర్ ముగిసిన వెంటనే మరలా త్రివిక్రమ్ తో పని చేయాలని ఫాన్స్ చెపుతున్నారట. తారక్ కి కూడా త్రివిక్రమ్ తో పని చేయాలని అనిపిస్తుందట. అందుకే ఎలాగైనా త్రివిక్రమ్ ని లాక్ చేయాలనే అనుకుంటున్నాడు.
Recent Post