ట్విటర్‌లో నాగ్ అభిమానిగా అమ‌ల ప్రేమ సందేశం!

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 09:56 PM

అక్కినేని నాగార్జున తెలుగు ఇండస్ట్రీలో మన్మధుడు అనే పేరు గాంచిన హీరో .. అ పేరుకు తగ్గట్టే అయన కూడా ఇప్పటికి అలాగే ఉన్నారు .. తన కుమారులు అయిన నాగ చైతన్య మరియు అఖిల్ లతో పోటి పడుతున్నారు .. అయితే ఆయన తెలుగు చిత్ర పరశ్రమకు హీరోగా పరిచయం అయి మే 23తో 33 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన ప్రియమైన సతీమణి అమల ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. ఓ అభిమానిగా, భార్యగా తన ప్రేమను లేఖ ద్వారా తెలిపారు. నా హీరో, నా భర్త, నా స్నేహితుడు.. నువ్వు నీ కాళ్లపై నిలబడ్డావు. ఓ నటుడిగా ఎంతో ఎత్తు ఎదిగావు. ఇప్పటికీ నువ్వు స్క్రీన్‌పై కనపడితే నేను నా చూపులు పక్కకు తిప్పుకోలేకపోతున్నా. ఇప్పటికీ నా గుండె నీ నవ్వు, కళ్లలోని మెరుపు, స్టైల్‌ చూసేందుకు తపిస్తోంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ నువ్వు ఇంకా అందంగా తయారౌతున్నావు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని చెబుతూ మాకు ఓ ఉదాహరణగా నిలిచావు. నీ కొత్త సినిమా విడుదల అవుతున్న ప్రతిసారి.. ఎలా కనిపించబోతున్నావని ఆతృతగా చూస్తుంటా. మిస్టరీ, రొమాన్స్‌, యాక్షన్‌, కామెడీ.. ఇలా అనేక కథలతో అలరించావు. నువ్వు నన్ను ఆ దేవుళ్లు శ్రీ వేంకటేశ్వర స్వామికి, రాముడికి, షిరిడి సాయికి పరిచయం చేశావు. ఆ దేవుళ్లు ఇప్పుడు మన కుటుంబంలో భాగం అయ్యారు. నువ్వు మంచి కంటెంట్‌ ఉన్న కథల్ని మాకిస్తున్నావ్‌. ఓడిపోతానేమోనని నువ్వు ఎప్పుడూ భయపడలేదు. ఎందుకంటే.. నీ నుంచి ది బెస్ట్‌ ఇస్తావు కాబట్టి నీకు ఆ భయం రాదు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో నువ్వు ఎప్పుడూ ముందుంటావు. నీలోని నిర్మాతను కూడా ఎప్పుడూ ఓడిపోనివ్వలేదు. నీలాంటి నటుల వల్ల సినిమాల్లో ఓ మ్యాజిక్‌, ఓ ఫన్‌, గ్లామర్‌ ఉంటోంది. నువ్వే నా జీవితంలోని మ్యాజిక్‌. 33 ఏళ్ల సినీ కెరీర్‌కు, 95 సినిమాల్లో నటించినందుకు శుభాకాంక్షలు మై స్వీట్‌హార్ట్‌. ఇలానే అమితాబ్‌ బచ్చన్‌, అక్కినేని నాగేశ్వరరావులా చిత్ర పరిశ్రమలో నువ్వు ఇంకెన్నో ఏళ్లు రాణించాలని ఆశిస్తున్నా' అని అమల ట్విటర్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు
Recent Post