నిజాలేంటో చూపిస్తా!వర్మ

  Written by : Suryaa Desk Updated: Sun, May 26, 2019, 08:10 PM

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో నిజం చెప్పడానికి ప్రయత్నించా..కానీ కొంతమందికి అది నచ్చలేదని ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వర్మ మాట్లాడుతూ..నిజం చెప్పడం నచ్చకపోవడం వల్లే లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. ఏపీలో ఈ నెల 31న ఆ నిజాలేంటో చూపిస్తానని రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు. నేను తప్పనిసరి పరిస్థితుల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చేయాల్సి వచ్చింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ రాజకీయ అంశంతో కూడుకున్నది కాదు. తన తదుపరి సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లని వర్మ ప్రకటించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లే చంద్రబాబునాయుడు ఓడిపోయారన్నారు.


 
Recent Post