ట్రెండింగ్
Epaper    English    தமிழ்

UK లో 'కల్కి 2898AD' ఎంత వసూళ్లు చేసినదంటే...!

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 01, 2024, 05:25 PM



అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా బహుళ భాషల్లో విడుదలైంది. రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ ప్రాజెక్ట్‌కి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా UK థియేటర్ రైట్స్ ని డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా UK బాక్స్ఆఫీస్ వద్ద £444,643 వసూళ్లు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం ఆన్లైన్ లో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో దిశా పటాని, పశుపతి, మరియు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతంఅందించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com