ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నార్త్ అమెరికాలో $450K క్లబ్ లో జాయిన్ అయ్యిన 'రాయన్'

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 01, 2024, 07:31 PM



కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన ల్యాండ్‌మార్క్ 50వ చిత్రానికి తానే స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా రాయన్ అనే టైటిల్ తో తమిళం, తెలుగు మరియు హిందీలో జులై 26, 2024న థియేటర్లలో విడుదల అయ్యింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నార్త్ అమెరికాలో $450K గ్రాస్ ని వసూళ్లు చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం నటుడి యొక్క పోస్టర్ ని సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ సినిమాలో దుషార విజయన్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి మరియు SJ సూర్య కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com