ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలీవుడ్‌లో కూడా జగన్ బయోపిక్!

cinema |  Suryaa Desk  | Published : Wed, May 29, 2019, 09:01 PM



ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా జగన్ మాట వినిపిస్తోంది.  జగన్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.  జగన్ విజయం తరువాత ఆయన జీవితం ఆధారంగా సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్న సంగతి తెలిసిందే.  టాలీవుడ్ మహి వి రాఘవ.. జగన్ పాదయాత్రను ఆధారంగా చేసుకొని యాత్ర 2 చేయడానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. 
అటు బాలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను కూడా జగన్ లైఫ్ పై పడింది.  జగన్ పార్టీ పెట్టడం దగ్గరి నుంచి అధికారం దక్కించుకునే వరకు జరిగిన పరిమాణాలు ఆధారంగా చేసుకొని సినిమా చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు.  మంచి కథ దొరికింది.  జగన్ జీవితం ఆధారంగా సినిమా చేస్తే బాగుంటుందని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.  ఈ ట్వీట్ ను బట్టి చూస్తే... బాలీవుడ్ లో జగన్ లైఫ్ ను బయోపిక్ గా తీసేందుకు సిద్ధం అవుతున్నారని అనుకోవచ్చు.  అయితే, ఎవరు అందులో హీరోగా చేస్తారు అన్నది తెలియాలి.  


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com