తన నటనతో.. బోల్డ్ యాటిట్యూడ్ తో భారీ గుర్తింపే సంపాదించుకుంది బాలీవుడ్ నటి రాధిక ఆప్టే. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు క్యాప్షన్ ఇవ్వలేదు కానీ ఒక కొబ్బరి చెట్టు ఎమోజి మాత్రం పెట్టింది. క్రీమ్ కలర్లో ఉన్న హై వెయిస్ట్ ప్యాంట్.. క్రీమ్ – బ్లూ కాంబినేషన్ లో ఉన్న ఇన్నర్.. పైనేమో బటన్స్ పెట్టుకోకుండా వదిలేసిన నేవీ బ్లూ కలర్ బ్లేజర్ వేసుకొని ఓ వెరైటీ పోజులో కూర్చుంది. చేతులు వెనక్కు పెట్టుకొని ఒక హాట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఎరుపు రంగు లిప్ స్టిక్ .. ఒక సైడ్ కు వేసుకున్న జుట్టు.. రాధిక హాట్ నెస్ ను మరింతగా పెంచాయి. ఈ ఫోటోకు జనాలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు. ఒకరు “నీ హాట్ నెస్ కు నా ఫోన్ కరిగిపోయేలా ఉంది” అన్నారు. మరొకరు “ఏక్ నంబర్ బ్యూటీ” అన్నారు. ఇంకొకరు.. “ప్యాంట్ నీకు పట్టలేదు” అన్నారు. ఒక నెటిజనుడికి ఈ పోజు అసలు నచ్చినట్టు లేదు “నీకు మలబద్దకం ఉందా.. అలా ముక్కుతున్నట్టుగా కూర్చున్నావు” అన్నాడు. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చాలని లేదు కదా.